స్వతంత్ర వెబ్ డెస్క్: కేసీఆర్ కుటుంబానికి పదవులు ఇవ్వడం కోసం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమా తెలంగాణ వచ్చిందని ప్రశ్నించారు. బైంసాలో మజ్లిస్ గుండాలు అరాచకం చేస్తున్నారు. ఒక్కసారి మనం భైంసాలో ఉన్నామా..? పాకిస్తాన్ లో ఉన్నామా అని ప్రశ్నించారు. పండుగలు భయంగా చేసుకోవాల్సి వస్తుంది. పదేళ్లలో ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
70 శాతం పూర్తి అయిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి కాళేశ్వరం నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోయాయి.. ఈ పాపం ఎవరిది..? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు అన్యాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎరువులు అందజేస్తుందని.. గతంలో ఇలాంటి ఎరువులు ఎక్కడ లభించేవి కాదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని.. రైతులు పండించిన పంటల కొనుగోలు మీద 20వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొనగోలు చేస్తున్నట్టు తెలిపారు. సాయిల్ టెస్ట్ చేయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఎరువుల కొరతలు లేవు అని తెలిపారు.
మనం భైంసాలో ఉన్నామా..? పాకిస్తాన్ లో ఉన్నామా- కిషన్ రెడ్డి
Latest Articles
- Advertisement -