రేపు పిఠాపురం పర్యటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రేపు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కల్యాణ్‌. కాకి నాడ జిల్లా పర్యటనకు వస్తున్న జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లు చేయడంలో అధికా రులు నిమగ్నమయ్యారు.

రేపు హైదరాబాద్‌ నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి వచ్చే పవన్‌కల్యాణ్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గాన గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణ కల్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులోని నివాసానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఇక, జులై 2వ తేదీ ఉదయం చేబ్రోలు నివాసం నుంచి బయలుదేరి కాకినాడ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకూ పంచాయతీరాజ్‌శాఖ, అనంతరం ఇరిగేషన్‌ శాఖ, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు కనెక్టవిటీ, రహదారుల పరిస్థితిపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశ మవు తారు. సమావేశం అనంతరం చేబ్రోలు నివాసానికి చేరుకుంటారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమ వుతారు. జూలై 3వ తేదీన చేబ్రోలు నివాసం నుంచి కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుని అక్కడ సముద్రపు కోత ప్రాంతాలను పరిశీలిస్తారు. తిరిగి నివాసానికి చేరుకుని పిఠాపురం నియోజకవర్గ అధికారులతో పరిచయ కార్యక్రమం, అనంతరం టీడీపీ, బీజేపీ ముఖ్యనేతల సమావేశం లో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో జరిగే వారాహి సభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియ జేస్తారు.

Latest Articles

మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్