ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

  ఏపీలో రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానునంది. రేపు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా పాల్గననున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్ధిదారులకు 4 వేల 408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

  వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందినవారి పింఛను రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఎరియర్స్‌ కలుపుకుని మొత్తం రూ.7వేలు పంపిణీ చేయనున్నారు. రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగు లకు రూ.3వేల నుంచి రూ.6వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పింఛను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేస్తారు. ఐదో కేటగిరీలోని వారికి ఏ మార్పు లేకుండా యథావిధిగా పింఛను సొమ్మును అందజేస్తారు. సంబంధిత బ్యాంక్‌ బ్రాంచ్‌ల నుంచి శనివారం డబ్బులను డ్రా చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు.సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛను దారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది. ఒక్కరోజులోనే పంపిణీ చేయించా లని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండోరోజు పూర్తి చేయాలని నిర్దేశిం చింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగ స్వాములు కానున్నారు. మరోవైపు జులై 1న పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్