AP Budget Session |ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభవనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు మొత్తం 11 రోజులపాటు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమవేశంలో సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ప్రసంగంతోపాటు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది. ఈ నెల 16న సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూడా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో మొత్తంగా 12 బిల్లుల్ని ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఉగాది, ఆదివారం మినహా మిగతా రోజుల్లో సభను జరిపించాలి చూస్తుంది రాష్ట్ర సర్కారు. అయితే, ముందుగా ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో.. ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 16న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
AP Budget Session |గతేడాది 2 లక్షల 56 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం….ఈసారి 2 లక్షల 62వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ గా ఇది నిలువనుంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు. బడ్జెట్ లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై తీర్మానం చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళాభివృద్ధి, విశాఖ పెట్టుబడుల సదస్సుపై కీలక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా
Follow us on: Youtube Instagram