నవ సందేహాల పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో నవ సందేహాలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు. గ్రూప్-2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకని అడిగారు. ఇక, వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల కు వలసలు ఎందుకు పోతున్నారని అడిగారు. ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.
నవ సందేహాల పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
0
217
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


