నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

AP Budget Session |ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభవనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు మొత్తం 11 రోజులపాటు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమవేశంలో సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ ప్రసంగంతోపాటు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది. ఈ నెల 16న సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్‌ కూడా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో మొత్తంగా 12 బిల్లుల్ని ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఉగాది, ఆదివారం మినహా మిగతా రోజుల్లో సభను జరిపించాలి చూస్తుంది రాష్ట్ర సర్కారు. అయితే, ముందుగా ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో.. ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 16న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

AP Budget Session |గతేడాది 2 లక్షల 56 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం….ఈసారి 2 లక్షల 62వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ గా ఇది నిలువనుంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు. బడ్జెట్ లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై తీర్మానం చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళాభివృద్ధి, విశాఖ పెట్టుబడుల సదస్సుపై కీలక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్