దుబాయ్‌లో అనంత్‌ అంబానీ -రాధికల షాపింగ్

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికమ ర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుక ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఆ జంట షాపింగ్‌ చేస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో షాపింగ్‌ చేస్తూ ఈ జంట కనిపించింది. ఇక సంపన్నుల షాపింగ్‌ కావడంతో భారీ బందోబస్తుతో వెళ్లారు. అనంత్‌-రాధికలు కూడా భారీ సెక్యూరిటీ మధ్య లగ్జరీ కార్లతో దుబాయ్‌లోని విలాసవంతమైన సిటీ వాక్ మాల్‌లో ప్రత్యక్ష మయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అనంత్‌-రాధికల జంట దాదాపు 10 కోట్లు విలువ చేసే రోల్స్‌రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ మోడల్‌ కారులో మాల్‌లోకి ప్రవేశించారు. వారిచుట్టూ భారీ సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు లగ్జరీ కార్లతో సెక్యూరిటీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాన్వాయ్‌లో కాడిలాక్ ఎస్కలేడ్స్, జీఎంసీ యుకోన్ డెనాలిస్, చేవ్రొలెట్ సబర్బన్‌తోపాటు ఓ అంబులెన్స్ కూడా ఉంది. చివరకు వారు షాపింగ్‌ చేసిన లగేజీ తెచ్చుకోవడానికి సుమారు 25 కోట్ల విలువైన ఆ కార్ల కాన్వాయ్‌ను వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్‌ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2024 జులైలో అనంత్‌-రాధిక వివాహం చేసుకోనున్నారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్