28.7 C
Hyderabad
Sunday, April 19, 2026
spot_img

చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచైనా పోటీచేస్తా: ఆనం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరులో ముందస్తు ఎన్నికలు ఉండవచ్చని.. ఎన్నికల ముందు 60శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరతారని జోస్యం చెప్పారు.

మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, కంభం విజయరామిరెడ్డి ఒకే వేదికపైకి వచ్చారు. గానుగపెంటపల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ముగ్గురు పాల్గొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్