సమవుజ్జీల పోరులో ఫైనల్‌ చేరే జట్టు ఏదో?

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఉత్కంఠంగా సాగుతున్న ఐపీఎల్‌-16లో ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ తొలి క్వాలిఫయర్‌ మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోన్న టైటాన్స్‌ జట్టు రెట్టింపు విశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. సొంతగడ్డపై ఆడుతుండడం ధోనీ సేనకు కలిసొచ్చే అంశం. అయితే ఐపీఎల్‌లో చెన్నైపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ గెలవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బందికరంగా ఉంది.

మరోవైపు చెన్నైలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్‌ అని భావిస్తుండడంతో అతని కోసం టైటిల్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉంది సీఎస్కే. మరి సమవుజ్జీల పోరులో గెలిచి ఫైనల్‌ చేరేదెవరో? తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ ద్వారా మరో అవకాశం లభించనుంది.

అన్ని జట్ల కంటే ముందుగా గుజరాత్‌ టైటాన్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక చెన్నై జట్టు 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఆ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్