స్వతంత్ర వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani ) సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్(Shauryu) దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’(Hai Nanna) కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ‘అమ్మాడి’ లిరికల్ వీడియో పాట(Ammaadi Lyrical Video) ఇప్పుడు విడుదలైంది.
‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు ‘హాయ్ నాన్న’(Hai Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser), పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ ప్రమోషన్ మొదలు పెట్టిన చిత్రబృందం వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘సమయమా'(Samayama) పాటలో నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) మధ్య లవ్ ప్రేమను చూపించగా, రెండో పాట ‘గాజు బొమ్మ'(Gaju bomma)లో తండ్రి, కూతురు మధ్య అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించారు.
‘అమ్మాడి’ సాంగ్ అదుర్స్
ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ను విడుదల చేశారు. ‘అమ్మాడి'(Ammadi) అంటూ సాగే ఈ పాట నాని, మృణాల్(Nani, Mrinal) మధ్య ప్రేమను కళ్లకు కట్టి నట్లుగా చూపిస్తోంది. మృణాల్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో మొదలైన ఈ సాంగ్‌లో తన భర్త నాని గురించి పాడుతూ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాన్ని ఇందులో చూపించారు. నాని తనను ఎంత బాగా చూసుకుంటారు అనేది ఇందులో చూపించారు. థర్డ్ సింగిల్ లో నాని, మృణాల్ లవ్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. తొలి రెండు పాటల మాదిరిగానే ఈ పాట కూడా చాలా బాగా అలరిస్తోంది. అబ్దుల్ వాహబ్ సంగీతం వీనుల విందుగా ఉంది. కృష్ణ కాంత్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాలా భైరవ(Kala Bhairava), శక్తి శ్రీ గోపాలన్(Shakti Sri Gopalan) మధుర గానం ఆహా అనిపించింది.
డిసెంబర్ 7న పలు భాషల్లో విడుదల
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా(Baby Kiara Kanna) ఇందులో నాని కుమార్తెగా కనిపించ నుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ వర్గీస్(John Varghese) సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ(Praveen Antony) ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
‘సరిపోదా శనివారం’ షూటింగ్ లో బిజీ బిజీ
అటు ‘అంటే సుందరానికి’ తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నది. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ‘సరిపోదా శనివారం’(Saripoda Sanivaram) అనే ఆసక్తి కరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనుంది. దర్శక నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జేక్స్ బిజోయ్(Jakes Bijoy) సంగీతం సమకూర్చనున్నారు.