స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ఇటీవలే అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన ఖరారు అవగా ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. ఈ టూర్ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
అమిత్ షా షెడ్యూల్
- నాగపూర్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆదిలాబాద్ రానున్న అమిత్ షా
- మధ్యాహ్నం 2.35 గంటలకు ఆదిలాబాద్ చేరుకోనున్న అమిత్ షా
- మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఆదిలాబాద్‌లో బీజేపీ సభ
- సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా.
- సాయంత్రం 5.20 నుంచి 6 వరకు ITC కాకతీయలో రెస్ట్.
- సాయంత్రం 6.20 నుంచి 7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొననున్న షా.
- సాయంత్రం 7.40 నుంచి 8.40 వరకు ITC కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం, డిన్నర్.
- రాత్రి 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న అమిత్ షా.