ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. భారీగా నగదు, బంగారం పట్టివేత

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విస్తృత తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. హైదరాబాద్‌ ఫిలింనగర్ నారాయణమ్మ కళాశాల వద్ద కారులో రూ.30 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఛాదర్‌ఘాట్ క్రాస్‌రోడ్‌లో 9 లక్షలు… పురానాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టీవాలో తరలిస్తున్న 15లక్షలు.. చందానగర్ ఠాణా పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి నుంచి 5 లక్షలు, దినేష్ నుంచి 12 లక్షల నగదు.. నిజాం కళాశాల వద్ద తనిఖీల్లో అబిడ్స్ పోలీసులకు కారులో తరలిస్తున్న ఏడున్నర కోట్ల విలువైన 7కిలోల బంగారం, 295 కిలోల వెండి పట్టుబడింది.

ఇక తాజాగా హైదరాబాద్‌ చైతన్యపురి పీఎస్‌ పరిధిలో రూ.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడగా.. సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మం. మట్టపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ.1.90 లక్షల నగదు పట్టుబడింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్