స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి బెయిల్, కస్టడీ పిటిషన్‌లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వలేమని పేర్కొంది. ఇప్పటి వరకు బాబుకు కేసులో కాస్తో, కూస్తో ఊరట లభిస్తుందని ఎదురుచూసినప్పటికి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో నలుగురు పేర్లు చేర్చింది సీఐడీ. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావును నిందితులుగా చేరుస్తూ సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కోర్టులో మళ్లీ చంద్రబాబుకు నిరాశే.. బెయిల్, కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్
0
463
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


