31.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

గోల్డెన్‌ వీసా అందుకున్న నటి కార్తిక నాయర్‌

Actress Karthika Nair |యుఎఈ ప్రభుత్వం నుంచి సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు గోల్డెన్‌ వీసా అందింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలోకార్తిక విశేషమైన పాత్ర పోషించారు. కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి, యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్‌ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్‌ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక తన సంతోషాయాన్ని వ్యక్తం చేస్తూ… ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్‌ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్‌ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే. కేరళలోనూ ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక(Actress Karthika Nair) తెలిపారు.

Read Also: విడాకుల దిశగా నిహారిక-చైతన్య జంట.. రంగంలోకి మెగాస్టార్?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్