స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మెదక్ జిల్లా గాంధీ నగర్ లో సమీర్ అనే వ్యక్తి 133 కేవీ విద్యుత్ టవర్ ని చిట్టచివరికి వరకు ఎక్కాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే టవర్ వద్దకు చేరుకొని ఆ యువకుడిని కిందికి దించే ప్రయత్నం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు మద్యం తాగి టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే కేవలం మద్యం తాగే టవర్ ఎక్కడా? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీర్ మెదక్ లోని ఓ బేకరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి.. చివరికి నచ్చజెప్పి అతి కష్టం మీద కిందకు దించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది.
సెల్ టవర్ చిట్టచివరికి ఎక్కి యువకుడు హల్చల్
0
429
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


