బీహార్‌లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన

బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి. నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీఎం కలల ప్రాజెక్టు అయిన ఈ తీగల వంతెన వరుసగా కూలిపోతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ ఈ వంతెన తమకు అందుబాటులోకి వస్తుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనపై ప్రాజెక్టు బాధ్యత వహించే నిర్మాణ సంస్థ ఎస్‌కే సింగ్లా కన్స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్