మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్టుల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. దాదాపు 34వేల 000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పూణె, థానే, బెంగళూరు మెట్రో ప్రాజెక్ట్ సౌకర్యాల కోసం ఆమోదం తెలిపింది. థానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, పూణె మెట్రో ఫేజ్-1, బెంగళూరు మెట్రో ఫేజ్-3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు మంత్రి తెలిపారు.
బెంగళూరు మెట్రో ఫేజ్-3 నిర్మాణంలో భాగంగా 44.65 కిలోమీటర్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2029 నాటికి ఫేజ్-3 మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానుంది. బెంగళూరు మెట్రో రైలు ప్రాజక్టుకు 15వేల 611 కోట్లను కేంద్రం కేటాయించింది. థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 12వేల 200 కోట్లు కేటాయించారు. 22 స్టేషన్లను కలుపుతూ 29 కిలోమీటర్ల కారిడార్‌గా దీనిని రూపొందిస్తున్నారు. కాగా, పాట్నాలోని బిహాతా, పశ్చిమబెంగాల్లోని బాగ్డోగరాలో 2వేల 962 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.