లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, తాను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. దీంతో నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు వచ్చాయి. ఏకాంతంగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని… మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 వీడియోలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.