35.2 C
Hyderabad
Monday, May 13, 2024
spot_img

ఒక్క ఛాన్స్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

    ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల నాడి నేతలకు అంతు చిక్కడం లేదు.దీంతో ఎంపీ అభ్యర్థులు చెంగు చాచి ఓట్లడుగుతున్నారు….ఇంకొకరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు. మరో నేత అదే దారిలో ఓటర్లను ఒక్క ఛాన్స్ ఇవ్వమని వేడుకుంటున్నారు.ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వేషన్ గా మారిన తరువాత ఏ పార్టీ రెండోసారి విజయాన్ని దక్కించుకోలేకపోయాయి. ఏ నాయకుడిని రెండో సారి విజయం సాధించిన ధాఖలాలు కూడా లేవు… ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల నేతలు ఒక్క ఛాన్స్ నినాదంతో ముందుకెళ్తున్నారు. ఆ ముగ్గురు అభ్యర్థులుగెలుపే లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నారు.

   ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఒక అభ్యర్థికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరో దఫా మరొకరికి పట్టం కడుతు న్నారు. ఎస్టీ రిజర్వేషన్ గా మారిన తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా రెండోసారి గెలిచే అవకాశం దక్కలేదు. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నందున పాత సాంప్రదాయమే కొనసాగుతుందా లేక చరిత్ర మారుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్ టి కి రిజర్వు అయింది. అప్పటినుంచి మూడుసార్లు ఎన్నికలు జరగగా ఏ పార్టీ అభ్యర్థి కూడా రెండోసారి విజయం సాధంచలేదు. 2009లో టీడీపీ నుంచి రాథోడ్ రమేష్ 2014లో టీఆర్ఎస్ నుంచి గోడెం నగేష్ 2019లో బీజేపీ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. ఒకసారి లంబాడా, రెండుసార్లు ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన లీడర్లు ఎంపీలుగా గెలుపొందారు, ఈసారి మాత్రం మూడు పార్టీల నుంచి ఆదివాసీలు బరిలోకి దిగడం మరింత ఉత్కంఠ రేపుతోంది .

   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఒక్క ఖానాపూర్ నియోజకవర్గ మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జిల్లా చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓ మహిళకు టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టడంతోపాటు ఇన్చార్జిగా మంత్రి సీతక్కకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొంగు చాచి అడుగుతున్నా మీ ఆడబిడ్డనైన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓటర్లను వేడుకుంటున్నారు. కాంగ్రెస్ లీడర్లు సైతం కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అనే నినాదంతో గడపగడపకు తిరుగుతున్నారు.

   రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఓటమిపాలవ్వడంతో జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోత్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ లో ఉన్న చాలామంది ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలలోకి వెళ్లడంతో ఆ పార్టీ కొంత ఉనికి కోల్పోయిందనే చెప్పాలి. ఆ పార్టీ తరఫున పార్లమెంట్ బరిలో మాత్రం సక్కును నిలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తన ఉనికి కాపాడుకునేందుకే శ్రమించాల్సి వస్తోందని సర్వత్రా వినిపిస్తున్న మాట. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని క్యాడర్లో పెద్ద చర్చే జరుగుతుంది. అయితే పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఆత్రం సక్కు ఒక్క ఛాయస్ ఇవ్వండి అంటూ ప్రజల మద్దతు కూడగడుతూ ముందుకు వెళ్తున్నారు .

   ఆదిలాబాద్ బీజేపీ టికెట్టు సిట్టింగ్ ఎంపీ అయినా సోయం బాపురావు కాకుండా టీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడెం నాగేష్ కు కేటాయించడంతో ఆ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగింది. కానీ ఎంపీ క్యాండేట్ ప్రకటన తర్వాత పార్టీలో అంతఃకలహాలు ఉన్నాయని గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో క్యాడర్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నగేష్ కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో సైతం అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణులు మాత్రం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ దేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి గోడెం నగేష్ తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభివృద్ధి చేసి చూపిస్తానంటూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.మొత్తం మీద మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నారు. మరి అభ్యర్థుల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా! నేతల ఒక్క ఛాన్స్ మంత్రం ఎంతమేరకు పనిచేస్తుందో! ఓటరు ఎవరికి పట్టం కడతారో ఎలక్షన్ వరకు వేచి చూడాల్సిందే.

Latest Articles

2024 ఏడాది ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

  అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జా తీయ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్