30.2 C
Hyderabad
Saturday, May 25, 2024
spot_img

మే 20న ఐదవ విడత ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మరో మూడు విడతల పోలింగ్ మిగిలింది. జాన్‌ నాల్గవ తేదీ లెక్కింపు తరువాత ఫలితాలు విడుదల అవుతాయి. నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐదవ విడత ఎన్నికలపై పడింది. మే 20న ఐదవ విడత ఎన్నికలు జరుగుతాయి. ఐదవ విడత పోలింగ్‌ కు ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా 695 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీహార్‌, జమ్మూ కాశ్మీర్, ఝార్కండ్, లడఖ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఐదవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 695 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 82 మంది బరిలో ఉన్నారు. అంటే మొత్తం అభ్యర్థుల్లో కేవలం 12 శాతమే అన్నమాట. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉండటం ఇదే తొలిసారి అంటోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్ధ.

మొదటి విడత ఎన్నికల్లో మొత్తం 135 మంది క్యాండిడేట్లు పోటీ చేయగా, ఎనిమిది శాతం మహిళ లున్నారు. రెండో విడత ఎన్నికల్లో వంద మంది క్యాండిడేట్లు పోటీ చేయగా, ఎనిమిది శాతం మాత్రమే మహిళలున్నారు. మూడో విడతలో మొత్తం 123 మంది పోటీ చేశారు. వీరిలో తొమ్మిది శాతం మంది మాత్రమే మహిళలు. ఇక తాజాగా ముగిసిన నాలుగో విడత లో మొత్తం 170 మంది పోటీ చేశారు. ఈ క్యాండిడేట్లలో పదిశాత మంది మహిళా క్యాండిడేట్లు. మరో విషయం ఏమిటంటే, మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అంతేకాదు.వీరిలో 18 శాతం మీద తీవ్ర క్రిమినల్ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. అలాగే 29 మంది అభ్యర్థులపై మహిళలపై వేధింపుల కేసులున్నాయి. ఇదిలా ఉంటే బరిలో ఉన్న వారిలో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండటాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తీవ్రంగా పరిగణించింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలే ముఖ్యమవుతున్నాయి. అయితే సదరు గెలుపు గుర్రానికి నేర చరిత్ర ఉన్నా పట్టించుకునే పరిస్థితి లో రాజకీయ పార్టీలు లేవు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక దురదృష్టకర పరిణామం. కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీలకు పరమావధిగా మారింది. నేరచరితు లకు, రకరకాల కుంభకోణాల్లో చిక్కుకున్న వారికి, టికెట్లు ఇచ్చి బరిలో నిలుపుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా మారింది.రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం చేయడం లేదు. దీంతో నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది.

  భారతదేశ రాజకీయాల డైనమిక్స్ కొంతకాలంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన నేరగాళ్లు చాలా సైలెంట్‌గా ఉండేవారు. తమ నేరమయ జీవితం గురించి ప్రస్తావించడానికి సిగ్గుపడే వారు.అయితే కొంతకాలంగా నేరగాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులు తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల గురించి బాహాటంగా వెల్లడిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి తమకు నేర చరిత్ర ఉన్న విషయాన్ని కూడా అదేదో పెద్ద కిరీటంలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నేరగాళ్ల ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం బలహీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణ లు కూడా ఉన్నాయి. నేరరహిత రాజకీయాలకు పొలిటికల్ పార్టీలు ముందు కు రావాలి. రాజకీయాల్లో నేరగాళ్లకు కళ్లెం వేసే దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాలి. అప్పుడే చట్టసభల్లో నేరగాళ్ల ఎంట్రీకి ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోటీశ్వరులైన అభ్యర్థుల సరాసరి ఆస్తుల విలువ 3.56 కోట్ల రూపాయలు. ఇక విద్యార్హతల విషయానికొస్తే, యాభై శాతం మంది పట్ట భద్రులు లేదా అంతకంటే ఉన్నత చదువులు చదివినవారు. అలాగే మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 26 మంది వివిధ సాంకేతిక కోర్సుల డిప్లామా హోల్డర్లు. ఏమైనా, ఐదవ విడత పోలింగ్‌ మొత్తం 695 మంది అభ్యర్థుల భవిత తేల్చనుంది.

Latest Articles

‘యక్షిణి’లో జ్వాలగా నేను తప్ప ఎవరూ చేయలేరనిపించింది: మంచు లక్ష్మి

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "యక్షిణి". ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్