చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యక్తి హత్య

      రంగారెడ్డి రెడ్డి చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ వ్యక్తి హత్య సంచలనం కలిగించింది. ఇంట్లోనే హత్య కు పాల్పడిన దుండగులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు యత్నించారు. కాళ్లు కట్టి.. మూటలో చుట్టి తరలించే క్రమంలో స్ధానికులకు కంటబడటంతో మూటను వదిలి పరారయ్యారు. ఘటనా స్ధలానికి చేరుకున్న చేవెళ్ళ పోలీసులు మృతున్ని సీపీఐ కాలనీలో అద్దెకు ఉంటున్న మహమూద్‌గా గుర్తించారు. మృతుని ఒంటిపై గాయాలున్నట్లు తెలిపిన పోలీసులు ఇంట్లో రక్తపు మరకల్ని గుర్తించారు. దీంతో క్లూస్‌టీమ్‌తో దర్యాప్తు చేపట్టి ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్