మహంకాళి బోనాల్లో అపశృతి.. షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నిన్న రాత్రి పడిన వర్షానికి కరెంట్ స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో.. దానికి తగిలి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ బేగంబజార్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి వర్షం కురవడంతో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చోట ఆగాడు. పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి కరెంట్‌ సరఫరా అవుతుండగా ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గంతలో కూడా ఓ వ్యక్తి ఇదే విద్యుత్ స్తంభానికి తగిలి షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

 

Latest Articles

డకౌట్‌ నుంచి తప్పించుకున్న వైభవ్‌ సూర్యవంశీ

ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ డకౌట్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్‌ బౌలింగ్‌లో వైభవ్‌ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్