బాలీవుడ్ నటి పూనమ్ పాండేకి అనూహ్య పరిణామం ఎదుర్కొంది. ముంబై నగరానికి వచ్చిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెతో మిస్ బిహేవ్ చేయబోయాడు. వెంటనే ఆమె అతనిని నిలువరించింది. చుట్టుపక్కల వున్న వాళ్లు కూడా అతనిని అడ్డుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేయబోయాడు.?
పూనమ్ తాజాగా ముంబై నగర వీధుల్లో తిరిగారు. తనను గుర్తించిన అక్కడ కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో వెనకాల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఓ వ్యక్తి పూనమ్ పాండే వద్దకు వచ్చాడు. ఆమెతో సెల్ఫీ దిగుతానని చెప్పి ముద్దు పెట్టబోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పూనమ్…. అతన్ని నెట్టేసింది. ఆ వెంటనే పూనమ్ పాండేకు సహాయంగా వచ్చిన వారంతా అతన్ని నిలువరించారు. పూనమ్ పాండే షాక్‌లో ఉండిపోయి ఉదయాన్నే తాగేసి రావడమేంటి అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్‌లో వైరల్ అవుతుంది.
పూనమ్ పాండే ఇష్యూపై నెటిజన్ల స్పందన మరోలా ఉంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. నటితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కొందరు తిట్టిపోస్తున్నారు. అందరి ముందూ ఇలా ఆమెతో ఎలా ప్రవర్తిస్తాడంటూ తప్పుపట్టారు. ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని తిట్టిపోశారు. మరికొందరు మంచి ప్రాంక్ చేశారంటూ సెటైర్ వేశారు. ఇంకొందరు పబ్లిసిటీ స్టంట్‌గా పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆడిన డ్రామా అంటూ అభిప్రాయపడ్డారు. మంచి స్క్రిప్ట్ కాదంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. వా క్యా యాక్టింగ్ హై అంటూ మరొకరు కామెంట్ చేశారు.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే తరచూ వింత చర్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె చుట్టూ ఎప్పుడూ కాంట్రవర్సీలే. గతంలో గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసిందంటూ వార్తలు వచ్చాయి. పూనమ్ సొంత అకౌంట్ నుంచే మరణ వార్త పోస్ట్ కావడంతో అందరూ నిజమే అనుకున్నారు. ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోయాయా అంటూ సెలబ్రిటీలు నివాళులర్పించారు. కానీ అంతలోనే ఆమె అందరికీ ఝలక్ ఇచ్చింది. తాను బతికేఉన్నానని.. క్యాన్సర్ మీద అవగాహన కోసమే ఇలా డ్రామా ఆడినట్టు తెలిపింది. మొత్తానికి అందరినీ బకరా చేయడం పూనమ్ పాండేకి కొత్తేమీ కాదని తేల్చింది.