ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ ను అభినందించిన తెలంగాణ సీఎస్, డీజీపీ

Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌-2023 లో యాభై కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar) లు శుక్రవారం దుశ్శాలువా, పుష్పగుచ్చాలతో అభినందించారు. బీఆర్ కేఆర్ భవన్ లో సి.ఎస్.శాంతి కుమారి(CS Shanti Kumari)ని.. నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి భారత దేశంతో పాటు తెలంగాణా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిన నిఖత్ జరీన్ ను సి.ఎస్. శాంతి కుమారి అభినందించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, నేటి యువ క్రీడాకారులకు జరీన్(Nikhat Zareen) ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు.

Read Also:  హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్