TSPSC ఓ జిరాక్స్ సెంటర్.. ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం

TSPSC Xerox Center |హైదరాబాద్ లోని TSPSC కార్యాలయం ఎదుట పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. TSPSC ఓ జిరాక్స్ సెంటర్ అని.. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లభిస్తాయని సెటైర్లు విసురుతూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరుతో వెలిసి ఈ పోస్టర్లలో.. తప్పు చేసిన TSPSC బోర్డును రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయం ఏంటి? శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా? అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ తక్షణమే రాష్ట్రంలోని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో సీఎం కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. లీకేజీ కారణంగా నష్టపోయిన నిరుద్యోగులకు నెలకు రూ.10 వేల చొప్పున పరీక్ష నిర్వహించే వరకు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.

Read Also: పేపర్ లీకులు సర్వ సాధారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్