నేడు లేదా రేపు వర్ష ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

తెలంగాణలో వడగళ్ల వాన అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో ఇవాళ లేదా రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదికలు అందాక.. ఎక్కువ నష్టపోయిన జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి బయల్దేరనున్నట్లు సమాచారం.

ఇప్పటికే తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా వేసింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు పంట నష్టపోయారని తెలిపింది. ఎక్కువగా మొక్కజొన్న… తర్వాత వరి, మిర్చి, వేరుశనగ, పత్తిపంటలు దెబ్బతిన్నాయి. మామిడి, టమోటా, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ పంటలు నేలమట్టం అయ్యాయి.

Latest Articles

టాక్సిక్‌ రీ షూట్‌ నిజమేనా?

కన్నడ స్టార్ యష్‌ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌.. మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రంలోని కొంత భాగంతో యష్‌ సంతృప్తిగా లేరని.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్