ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా నేడు మరోసారి ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) హజరుకానున్నారు. నిన్న 9 గంటల పాటు విచారించిన ఈడీ.. ఈరోజు కూడా మళ్లీ విచారణకు రావాలని నోటీసులు పంపించారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కల్వకుంట్ల కవిత మరోసారి ఈడి విచారణకు వెళ్లనుంది. అయితే ఈడీ కార్యాలయానికి వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా నిన్న కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ.. అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో ఆమెను నిన్న అరెస్టు చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈడీ ఆ నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది.
Read Also: శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు
Follow us on: Youtube Instagram