బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ చిత్రం రామాయణ. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ మూవీ విషయంలో మేకర్స్ మళ్లీ తప్పు చేస్తున్నారని ఓ వార్త ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..? రామాయణ మేకర్స్ చేస్తున్న ఆ తప్పు ఏంటి..?
రామాయణ విడుదల తేదీ విషయంలో కొత్త ట్విస్టు బయట పడింది. అది ఏంటంటే.. ఓవర్సీస్ లో నవంబర్ 6న, ఆతర్వాత రెండు రోజులు ఆలస్యంగా ఇండియాలో నవంబర్ 8న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని గంటల గ్యాప్ తర్వాత రిలీజ్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. రెండు రోజుల గ్యాప్ తర్వాత రిలీజ్ చేయడం అనేది చాలా చేటు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి నమిత్ మల్హోత్రా చెబుతున్న కారణాలు డిస్ట్రిబ్యూషన్ సమస్య ప్లస్ దీపావళి పండగ. సమస్య ఏమిటంటే.. నవంబర్ 6న యు.ఎస్ తదితర దేశాల్లో ముందే ప్రీమియర్ వేయడం వలన సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్, ఆన్ లైన్ పైరసీ ముందే వచ్చేస్తాయి. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా వీటిని నియంత్రించడం అంత ఈజీ కాదు.
రామాయణ చిత్రాన్ని విదేశాల్లో ముందుగా రిలీజ్ చేసి ఆతర్వాత రెండు రోజులకు ఇండియాలో రిలీజ్ చేయడం అనేది ఏ మాత్రం సేఫ్ గేమ్ కాదని సినీ పండితులు భావిస్తున్నారు. బహుశా నవంబర్ 6 గాడ్జిల్లా మైనస్ జీరో మూవీ భారీ స్థాయిలో రిలీజవుతున్న కారణంగా స్క్రీన్ షేరింగ్ సమస్య తలెత్తకుండా ఇలా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీని వెనుక ప్రాక్టికల్ బిజినెస్ కోణాన్ని నమిత్ సరిగ్గా అంచనా వేయలేదేమో అనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ విషయంలో కూడా ఇలాగే తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీమ్ మాత్రం అసలు కంటెంట్ స్క్రీన్ మీద గొప్ప అనుభూతి ఇస్తుందని, మునుపెన్నడూ చూడని స్థాయిలో రామాయణని తరతరాలు గుర్తుంచుకునేలా ఉంటుందని చెబుతున్నారు. మరి.. రామాయణ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరుకు మెప్పిస్తుందో చూడాలి.


