ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలులోని పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్‌లోని అతని నివాసంతో పాటు, అతనికి సంబంధం ఉన్న మరో ఐదు ప్రదేశాలలో ఏసీబీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. ఆరు ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ కర్నూలు ఇన్‌చార్జ్ డీఎస్పీ సీతారామారావు తెలిపారు. ఇప్పటివరకు, అధికారులు కర్నూలులో మూడు విలాసవంతమైన భవనాలు, ఐదు ఖాళీ ప్లాట్లను గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ 2.80 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
0
120
Previous article
Next article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


