విశ్వనాథ్ అండ్ సన్స్.. విశ్వరూపం చూపిస్తారా..?

కోలీవుడ్ స్టార్ సూర్య కరుప్పు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ దాదాపుగా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇప్పుడు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ అనే క్లాస్ మూవీతో రాబోతున్నాడు. అయితే.. కరుప్పు రేంజ్లో విశ్వనాథ్ అండ్ సన్స్.. భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. పైగా రెగ్యులర్ స్టోరీలా కాకుండా.. డిఫరెంట్ కంటెంట్తో వస్తున్న సినిమా ఇది. మరి.. విశ్వనాథ్ అండ్ సన్స్.. బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపించే ఛాన్స్ ఉందా..? లేదా..? తెలుసుకుందాం రండి..

కోలీవుడ్ స్టార్ సూర్య.. తమిళ్లో వలే తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. తన సినిమాలను తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేస్తుండడంతో ఇక్కడ కూడా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సమ్మర్లో వచ్చిన కరుప్పు సినిమాని తెలుగులో వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ చేస్తే.. మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం కావడంతో అంచనాల పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా పై నమ్మకం పెట్టుకున్నారు. ఆగస్ట్ 2 చెన్నైలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కరుప్పు మూవీ దాదాపుగా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో.. విశ్వనాథ్ అండ్ సన్స్ ఆ రేంజ్లో కలెక్ట్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
పాతికేళ్ల అమ్మాయి, నలభై వయసున్న వ్యక్తిని ప్రేమించడమే ఇందులో మెయిన్ పాయింట్. అయితే.. దీనికి విశ్వనాథ్ ఆండ్ సన్స్ పేరు ఎందుకు పెట్టారు..? పోస్టర్లలో చూపించిన చిన్న బాబు కాకుండా ఇంకెవరైనా సూర్యకు సంతానం ఉన్నారా..? పిల్లల తండ్రిని మమిత బైజు ప్రేమించినట్టు వెంకీ రాసుకున్నారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం థియేటర్లో తెలుస్తుంది. రాధికా శరత్ కుమార్, రవీనాటాండన్ లాంటి సీనియర్లు ఇందులో పెద్ద పాత్రలే చేశారు. జివి ప్రకాష్ సంగీతంలో మొదటి పాట మంచి హిట్ కాగా రెండో సాంగ్ కు ఏమంత స్పందన లేదు.

కరుప్పు బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్న సూర్యకు ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో దాన్ని మ్యాచ్ చేయడమో లేదా క్రాస్ చేయడం ద్వారా తన మార్కెట్ ని మరింత పటిష్ట పరుచుకోవచ్చు. కానీ ఇలాంటి క్లాస్ మూవీతో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమా అనేది అసలు ప్రశ్న. అయితే.. జనాలకు కంటెంట్ కనెక్ట్ అవుతుందా లేదానే భయం అక్కర్లేదని.. తప్పకుండా అందరికీ నచ్చుతుందని.. మరోసారి సూర్య బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. మరి.. కరుప్పుని మించిన సక్సెస్ విశ్వనాథ్ అండ్ సన్స్ సాధిస్తారేమో చూడాలి.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్