వెంకీ అట్లూరి.. టాలెంటెడ్ డైరెక్టర్. వరుసగా సక్సెస్ సాధిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నాడు. లేటెస్ట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా తెరకెక్కించాడు. అయితే.. ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు కానీ.. టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేయడం లేదు. నెక్ట్స్ మూవీని కూడా కోలీవుడ్ స్టార్ తోనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. తెలుగు హీరోలతో.. వెంకీ అట్లూరి సినిమాలు ఎందుకు చేయడం లేదు. అసలు.. వెంకీ అట్లూరి ప్లాన్ ఏంటి..?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కెరీర్లో వరుసగా విభిన్న కథలతో సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వరుసగా సక్సెస్ సాధిస్తున్నారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్.. చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తెరకెక్కించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే.. వెంకీ అట్లూరి వరుసగా తమిళ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు కానీ.. తెలుగు హీరోలతో సినిమాలు చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.
వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన మరోసారి తమిళ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సార్ మంచి విజయాన్ని అందుకోవడంతో, మరోసారి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారట. ఇటీవల ధనుష్ కి పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ లైన్ చెబితే.. లైన్ బాగుంది.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రిలీజ్ తర్వాత ధనుష్ తో చేసే మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడు.
తెలుగు స్టార్స్ తో వెంకీ అట్లూరి సినిమా చేయడా అంటే ఎందుకు చేయను చేస్తాను కానీ.. సెట్ కావడం లేదు అంటున్నాడు. నాగచైతన్యతో సినిమా చేయాలని నాలుగు కథలు చెబితే బాగున్నాయి అన్నాడు కానీ.. డేట్స్ సెట్ కాకపోవడం వలన కుదరలేదట. అలాగే నానితో చేయాలని ట్రై చేసినా కుదరలేదట. మరి.. వెంకీ అట్లూరి ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తాడో..? ఎప్పుడు సెట్ అవుతుందో.. క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


