కాంతార అనే ఒకే ఒక్క సినిమాతో.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు రిషబ్ శెట్టి. ఆతర్వాత కాంతార ఛాప్టర్ 1 అని తీస్తే.. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో బిగ్ సక్సెస్ సాధించింది. దీంతో.. రిషబ్ శెట్టికి డిమాండ్ బాగా పెరిగింది. తెలుగులో ఓ భారీ, క్రేజీ సినిమా చేయనున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ భారీ సినిమా క్యాన్సిల్ అయ్యింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ భారీ సినిమా ఎవరితో..? క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి..?
కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టితో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ భారీ చిత్రం చేయాలి అనుకున్నారు. గతంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 18వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆకాశవాణి మూవీ దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించాల్సి ఉంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి, తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనే ప్లాన్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా ప్రచారం ప్రకారం… ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా రిషబ్ శెట్టి పారితోషికం పెరగడమేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంతార బ్లాక్‌బస్టర్ విజయానంతరం రిషబ్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచారని, నిర్మాత నాగ వంశీతో ఆర్థిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదనేది ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ఈ విషయం పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక ఈ మూవీ దర్శకుడు అశ్విన్ గంగరాజు తన సినిమా కోసం మరో హీరోతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
మరో వైపు రిషబ్ శెట్టి ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న జై హనుమాన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. రిషబ్ శెట్టితో మూవీ క్యాన్సిల్ అయ్యిందని నాగవంశీ అఫీసియల్ గా అనౌన్స్ చేయలేదు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


