అక్కినేని ఫ్యామిలీ హీరోకి.. ఈసారైనా కలిసొస్తుందా..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.. టాలెంటెడ్ యాక్టర్. ఆయన సినిమాలు ప్లాప్ అయ్యాయి కానీ.. యాక్టర్ గా సుమంత్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. భారీ అభిమాన గణం ఉంది.. టాలెంట్ ఉంది.. అయినా కానీ.. సుమంత్ కి కావాల్సిన సరైన సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమా చేశాడు. ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు. మరి.. ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది..? ఈ సినిమా అయినా సుమంత్ కి కలిసొస్తుందా..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రేమకథ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసారు సుమంత్. ఆతర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామ్మా చిలకమ్మ, స్నేహమంటే ఇదేరా సినిమాల్లో నటించినా.. సుమంత్ కు తొలి విజయం అంటే సత్యం సినిమాతో వచ్చింది. అయితే.. ఆతర్వాత ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. గౌరి, మహానంది, గోదావరి, గోల్కండ హైస్కూల్.. ఇలా విభిన్న కథా చిత్రాలు చేశాడు కానీ.. సినిమా సినిమాకి గ్యాప్ రావడం.. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవడంతో.. కెరీర్లో స్పీడు తగ్గింది. ఇలా ఒకసారి కాదు.. ఎన్నో సార్లు జరిగింది.

ఈమధ్య కాలంలో సుమంత్ కి.. మళ్లీ రావా సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. అయితే.. ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడంలో మళ్లీ తడబడ్డాడు. ఈమధ్య అనగనగా అనే ఓటీటీ సినిమాతో మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ప్రతి చర్యకూ సమానమైన ప్రతి చర్య ఉంటుంది అన్నది న్యూటన్స్ థర్డ్ లా. దీని నేపథ్యంలో రాజేష్ కర్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. టైటిల్‌కు తగ్గట్లే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రేసీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లున్నారు.

సుమంత్, జగపతిబాబు సహా కీలక పాత్రలన్నీ క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉన్నాయి. ట్రైలర్ కట్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఏదో మర్మం ఉంటుందని.. స్క్రీన్ ప్లే ప్రధానంగా థ్రిల్లింగ్‌గా సినిమాను తీర్చిదిద్దారని అనిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాను కాస్త ముందు నుంచే టీం ప్రమోట్ చేయాల్సింది. ఈ మధ్యే సినిమాను అనౌన్స్ చేశారు. జులై 31నే ఈ మూవీని విడుదల చేయబోతూ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రమోషన్స్ ఇంకాస్త ముందుగా స్టార్ట్ చేసుంటే బాగుండేది అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సినిమా అయినా సుమంత్ కి కలిసొస్తుందో లేదో చూడాలి.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్