కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా ఈ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో మూవీకి ఓకే చెప్పాడని.. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరు..? ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

కళ్యాణ్ రామ్.. ఓకే చెప్పింది దర్శకుడు పరశురామ్ అనేది ఇన్ సైడ్ న్యూస్. పరశురామ్.. యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి మెప్పంచాడు. అక్కడ నుంచి ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం, సర్కారు వారి పాట, ది ఫ్యామిలీ స్టార్ చిత్రాలు తెరకెక్కించారు. అయితే.. సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ది ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ప్లాప్ అయ్యింది. ఈ మూవీ వచ్చి రెండేళ్లు అయిపోయింది కానీ.. పరశురామ్ నుంచి కొత్త సినిమా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ కి కథ చెబితే ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందని సమాచారం.

కళ్యాణ్‌ రామ్, పరశురామ్ కాంబో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని తెలిసింది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్, వెంకటేష్‌తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే పరశురామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కథా చర్చలు సానుకూలంగా ముగిసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్‌కు ఇది కీలకమైన సినిమా కానుంది. మరో వైపు వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటున్న కళ్యాణ్‌రామ్‌కు కూడా ఇది మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి.. ఈ సినిమాతో అయినా పరశురామ్ సక్సెస్ సాధించి ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్