సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరుకు సుకుమార్ మూవీ అంటే.. మ్యూజిక్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాదే అందించేవారు. కానీ.. ఇప్పుడు సుకుమార్ వేరే డైరెక్టర్ తో మ్యూజిక్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. అంతే కాదండోయ్.. సుక్కు నెక్ట్స్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఇద్దరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కబోతున్న భారీ చిత్రాన్ని అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రాకపోయినా.. తెర వెనుక పనులు చకా చకా జరుగుతున్నాయని తెలిసింది. సుకుమార్ ఈసారి తన స్టైల్ కి భిన్నంగా చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈసారి సుకుమార్ మ్యూజిక్ విషయంలో మార్పు కోరుకుంటున్నారట. ఇప్పటి వరుకు ఆర్య సినిమా నుంచి పుష్ప 2 వరుకు దేవిశ్రీప్రసాద్ తోనే మ్యూజిక్ చేయించారు. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య డిఫరెన్స్ వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

పుష్ప 2 మ్యూజిక్ విషయంలో డిఫరెన్స్ రావడం వలనో లేక మరో కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ.. ఈసారి మాత్రం సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని తపిస్తున్నారు అంటూ వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో మొదటిది సాయి అభ్యంకర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు చాలా క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్న ఈ యూత్ సెన్సేషన్ తో పని చేసేందుకు చరణ్, సుకుమార్ ఇద్దరూ ఆసక్తి చూపిస్తున్నారట. అయితే తన కమిట్ మెంట్స్ ఏ మేరకు తగినన్ని డేట్స్ దొరుకుతాయో లేదో చెప్పడం కష్టమని యూనిట్ నుంచి టాక్ వినిపిస్తోంది.

సుకుమార్ మూవీ కోసం వినిపిస్తోన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్ దేవ్. దురంధర్ రూపంలో ప్రేక్షక లోకానికి సరికొత్త మ్యూజిక్ ని పరిచయం చేసిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా సుకుమార్ పరిశీలనలో ఉన్నారని సమాచారం. అయితే.. సచ్ దేవ్ వర్కింగ్ స్టయిల్, కంపోజింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ నార్త్ వాళ్లకు కనెక్ట్ అయ్యేలా అనిపిస్తుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో తెలుగు వాళ్లకు కనెక్ట్ అయ్యేలా వర్క్ చేయించడం పెద్ద టాస్క్. అయితే.. యాక్షన్ ఎంటర్ టైనర్ అంటున్నారు కాబట్టి కాంబో బాగుంటుంది. వినిపిస్తున్న లీకులు నిజమైతే ఇతనితో ఆల్రెడీ వర్క్ కూడా మొదలయిందట. ఈ మూవీని 2028లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. సుకుమార్ నెక్ట్స్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

రామాయణ మేకర్స్ ఆ విషయంలో.. తప్పు చేసారా..?

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ రామాయణ. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రాముడుగా నటిస్తుంటే.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి సీతగా నటిస్తుంది. కేజీఎఫ్ హీరో యశ్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్