24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

‘హోలీ’ పండుగలోని పరమార్థం ఇదే!

Holi Festival |సనాతన సంప్రదాయాల్లో అనేక పండుగలు ఆచరణలో ఉన్నా.. దేశమంతటా ఎంతో ఐకమత్యంతో రంగురంగులతో జీవితాలన్నీ రంగులమయం కావాలని జరుపుకునే ఒకే ఒక్క పండుగ ‘హోలీ’. అయితే ఈ హోలీ పండుగను జరుపుకోవడానికి ఓ పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది.

హిరణ్యకశిపుని కుమారుడు భక్త ప్రహ్లాదుడు. అతను అత్యంత విష్ణు భక్తుడు. కాని తండ్రి హిరణ్యకశిపుడు మాత్రం శివ భక్తుడు. అయితే తన కుమారుడు ప్రహ్లాదుడు ఎన్ని సార్లు చెప్పినా.. విష్ణు నామం జపిస్తూ ఉన్నాడని ప్రహ్లాదునికి ప్రాణం తీయాలని విశ్వప్రయత్నాలు చేస్తాడు. ప్రతి ప్రయత్నంలో ఆ మహావిష్ణువు ప్రహ్లాదున్ని కాపాడుతాడు. హిరణ్యకశిపునికి హోళికా అనే సోదరి ఉంది. ఆమెకు ఒక వరం ఉంది. ఆమె అగ్నిలో దూకినా ఆమె ప్రాణాలకు ఏమి కాదు. దీంతో ప్రహ్లాదున్ని చంపేదుకు హోళికా.. ప్రహ్లాదుడుని తన వడిలో కూర్చోపెట్టుకుని అగ్నిలో కూర్చుంటుంది. అప్పుడు విష్ణమూర్తి మహిమ వల్ల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు.హోళికా అగ్నికి ఆహుతి అవుతుంది.

అప్పటి నుంచి ఆ పరమాత్ముడైన మహావిష్ణువుని ధ్యానించడం వల్ల.. అగ్నికి ఆహుతికాని హోళికా కూడా దగ్దమైందని.. పరమాత్ముడిని పూజించడం, ధ్యానించడం వల్ల కష్టకాలాల్లో ఆదుకుంటాడని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా జరుపుకొనే ఈ హోలీ.. రాక్షస జాతికి చెందిన హోళికా మరణించిన దానికి గుర్తుగా జరుపుకుంటారని ప్రాచుర్యం పొందింది.

Read Also: ‘ప్రాణం తీసిన యువకుడి కామం’

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్