‘ప్రాణం తీసిన యువకుడి కామం’

Nagpur |అధిక మద్యం సేవించి మోతాదుకు మించి వయాగ్రా వాడడంతో ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ సంఘటనకు సంభందించిన విషయాలను జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ ప్రచురించింది. ఈ మెడిసిన్ వాడేటప్పుడు వైద్యుల సలహా, సూచనలు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించింది.

మెడిసిన్ జర్నల్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో గల ఓ వ్యక్తి పీకలదాకా తాగి లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ఆపై తనతో వచ్చిన మహిళతో రాత్రంత గడిపాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాంతులు విపరీతంగా అవుతుండడంతో.. వెంట వచ్చిన మహిళ హోటల్ సిబ్బంది సాయం కోరింది. దీనికి ఆ వ్యక్తి సహాయాన్ని నిరాకరించడంతో గదిలోనే ఉండిపోయారు. మరికాసేపటికి పరిస్థితి తీవ్రతరం కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి తీసుకొస్తుండగానే చనిపోయాడని వెల్లడించారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం.. రక్తం గడ్డకట్టడం వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని.. ఆల్కహాల్ తో పాటు వయాగ్రా తీసుకోవడం, గతంలో రక్తపోటు ఉండటం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది.

Read Also: ఏసీ పేలి.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్