హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థి సంఘాలు, బీజేపీ కార్యకర్తలు పలుమార్లు స్కూల్‌ను ముట్టడికి యత్నించాయి. దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు పాఠశాలలలో తనిఖీలు చేపట్టారు. యాజమాన్యాన్ని వివరణ కోరారు. మరోవైపు ఇందుకు బాధ్యురాలైన టీచర్ ను సస్పెండ్ చేసినట్టు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
0
67
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


