తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి బుకింగ్‌కు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే వాడాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. దళారులు, నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలు, అనధికారిక వెబ్‌సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టికెట్ల విడుదల, రద్దు, టికెట్ల లభ్యత, వెయిటింగ్ టైమ్ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. SVBC ద్వారా భక్తులకు టీటీడీ అధికారిక సమాచారం అందిస్తోందని అదనపు ఈఓ తెలిపారు. టికెట్ సంబంధ సందేహాల కోసం టీటీడీ కాల్ సెంటర్ 155257ను సంప్రదించాలని సూచించారు. దళారులు సంప్రదిస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ 9866898630కు సమాచారం ఇవ్వాలని వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు.
శ్రీవారి దర్శనం, వసతి కోసం టీటీడీ వెబ్‌సైట్ వాడండి- టీటీడీ
0
16
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


