రూల్స్ ఆఫ్ బిజినెస్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖది అవగాహన లోపమన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్ష చేయలేదని..సమస్యలు వివరించేందుకుమ తానే వారివద్దకు వెళ్లాననని ఆయన తెలిపారు. మంత్రిగా ఉన్న ఆమెకు ఆ మాత్రం అవగాహన కూడా లేదా? అంటూ ప్రశ్నించారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడకూడదని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానని ఎద్దేవా చేశారు కడియం శ్రీహరి.
కొండా సురేఖది అవగాహన లోపం -కడియం
0
74
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


