ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారుల చేతివాటం

ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారులు చేతివాటం చూపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అర్హుల లిస్టులో పేరు కల్పిస్తామని 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ బిల్లులను మంజూరు చేయడానికి 10 వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన పైరవీకారులు తమ స్వలాభం కోసం మార్చుకుంటున్నారు. పేదల ప్రయోజనమే లక్ష్యంగా ఏ పథకాన్ని అనౌన్స్‌ చేసినా దళారులు ముందు వరుసలో ఉంటూ తమ చేతివాటం చూపిస్తున్నారు. అర్హత లేకున్నా పథకంలో లబ్ధి కల్పిస్తామని బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్‌, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తామే ఇల్లు వచ్చేలా చేశానని నమ్మబలుకుతున్నారు. బిల్లు సాంక్షన్‌ అవ్వాలంటే తనకు 10 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియోతో పాటు ఓ వీడియోను లబ్ధిదారులు రహస్యంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్