ఆర్య.. నయా ట్రెండ్ సెట్ చేసేనా..?

యానిమేషన్ మూవీస్ అంటే.. ఒకప్పుడు పిల్లలు మాత్రమే చూసేవారు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. యానిమేషన్ సినిమాలను పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా చూస్తున్నారు. అందుకనే.. హాలీవుడ్లో సూపర్ హీరోలు, కామిక్ క్యారెక్టర్స్, గేమింగ్ క్యారెక్టర్స్ తో యానిమేషన్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కూడా హాలీవుడ్ స్టైల్లో అడుగులు వేస్తుందని.. ఆర్య క్యారెక్టర్ తో యానిమేషన్ మూవీ ప్లాన్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆర్య యానిమేషన్ మూవీ ప్లాన్ ఎవరిది..? ఈ యానిమేషన్ మూవీ నయా ట్రెండ్ సెట్ చేసేనా..?

ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చింది. రెగ్యులర్ సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు. పైగా ఓటీటీ వచ్చిన తర్వాత వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. దీంతో మిగిలిన భాషల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది అనేది ఆడియన్స్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా యానిమేషన్ సినిమాలకు ఆదరణ లభిస్తుండడంతో ఆ వైపుగా సినిమాలు చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల కన్నడ నుంచి వచ్చిన మహావతార్ నరసింహా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాలకు మరింత ఊపు వచ్చింది.

ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణగా ఒకప్పుడు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఆర్య సినిమాలోని హీరో క్యారెక్టర్ ను కొత్త రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు గుర్తుంచుకునే ఐకానిక్ క్యారెక్టర్లకు కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా కొత్త కథను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది దిల్ రాజు ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కథలు, కొత్త డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే దిల్ రాజు ఇప్పుడు కొత్త తరానికి ఆర్యను సరికొత్తగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

యూత్ ఆడియ‌న్స్ యానిమేటెడ్ కంటెంట్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. పాత తరాన్ని, కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు ఈ సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇక క్రియేటీవ్ జీనియస్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా ఈ యానిమేషన్ మూవీ పై ప్రత్యేక దృష్టి పెట్టారని.. దీంతో ప్రాజెక్ట్‌ పై అంచనాలను మరింత పెంచుతోందని… వార్తలు వస్తున్నాయి. ఇటీవల బాహుబలి యానిమేషన్ మూవీ రాబోతుందని ప్రకటించారు. నెక్ట్స్ ఇయర్ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి, ఆర్య యానిమేషన్ మూవీస్ సక్సెస్ అయితే.. టాలీవుడ్లో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. దీంతో మరిన్ని సినిమాల్లోని క్యారెక్టర్స్ తో యానిమేషన్ మూవీస్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్