మహారాష్ట్రలో ముంబై-వడోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన BMW కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మృతుల శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ప్రమాద సమయంలో 250 కి.మీ. వేగంతో కారు ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. కారు టిట్‌వాలా నుంచి బద్లాపూర్ వైపు వెళ్తోంది. అతివేగంగా వస్తుండడంతో కారు అదుపుతప్పింది. మృతులను బద్లాపూర్‌కు చెందిన యోగేశ్ దిఘే, రికేబా జాకప్‌గా గుర్తించారు. ఇద్దరూ అకక్కడికక్కడే మృతి చెందగా.. ఆనంద్ అనే మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన థానేలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బర్త్ డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ముంబై-వడోదర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఎగిరిపడిన శరీరభాగాలు
0
53
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


