రజినీ మూవీలో క్రేజీ స్టార్…?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న క్రేజీ మూవీ జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇందులో ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ ఉందట. ఆ రోల్ కోసం.. టాలీవుడ్ స్టార్ బాలయ్య, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ లను కాంటాక్ట్ చేయడం.. సున్నితంగా నో చెప్పడం జరిగిందని టాక్ వినిపించింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో క్రేజీ స్టార్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇంతకీ.. ఆ క్రేజీ స్టార్ ఎవరు..? జైలర్ 2 థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

జైలర్ 2 లో.. ఓ గెస్ట్ రోల్ ఉందని.. ఆ రోల్ కోసం నందమూరి బాలకృష్ణ, షారుఖ్ ఖాన్.. పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్య ఓకే అన్నారని ప్రచారం జరిగింది. బాలయ్య, రజినీ మధ్య మంచి అనుబంధం ఉండడంతో.. నిజమే జైలర్ 2లో బాలయ్య కనిపిస్తారని ఎదురు చూసిన సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆతర్వాత షారుఖ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ముందుగా షారుఖ్ ఓకే అన్నారని.. అయితే.. కింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన లాస్ట్ మినిట్లో నో చెప్పారని టాక్ వచ్చింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ గెస్ట్ రోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ రోషన్ నటించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. జైలర్-2లో క్యామియోకు హృతిక్‌ను ఖాయం చేసి, షూటింగ్‌కు వెళ్లిపోనుందట టీం. షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖ మీడియా పోర్టల్స్‌లో ఈ న్యూస్ ఖరారు చేస్తూ వార్తలు కూడా వచ్చేశాయి. హృతిక్ నటిస్తే.. జైలర్-2కు హిందీలో మంచి బజ్ క్రియేట్ కావడం ఖాయం.

జైలర్ లో కనిపించిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా జైలర్ 2 కనిపించనున్నారు. జైలర్ మూవీ 500 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు జైలర్ 2 లో హృతిక్ నటిస్తే.. దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేయచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి.. జైలర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్