తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జూన్ 13 నుంచి 19 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 13న నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. జూన్ 14, 15 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 16 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగనుంది.

హైదరాబాద్‌లో వచ్చే 24 గంటల్లో మేఘావృత వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైతులకు సూచనగా రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్