డైరెక్టర్‌గా విశాల్ ప్రయత్నం ఫలించేనా..?

కోలీవుడ్ హీరో విశాల్.. ఇప్పుడు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మూవీ మకుటం. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇది ఈ సంస్థకు 99వ సినిమా కావడం విశేషం. ఫస్ట్ టైమ్ విశాల్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. మరి.. మకుటం టీజర్ ఎలా ఉంది..? ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా మెప్పించేనా..?

మార్క్ ఆంటోనీ, మద గజ రాజా చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే మకుటం ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా మకుటం రూపుదిద్దుకుంటోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చిన హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూడొచ్చు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇక విశాల్ అయితే మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించారు.

ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్‌ని చూస్తేనే తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టంగా చెబుతోంది. స్టైలిష్, విజువల్ ట్రీట్‌లా విశాల్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. మొత్తం మీద ఈ టీజర్‌ ఒక్కసారిగా మకుటం పై భారీ అంచనాల్ని పెంచేసింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని అతని కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. మకుటం జూలైలో విడుదల కానుంది. మరి.. టీజర్ ను బట్టి చూస్తే.. విశాల్ హీరోగా, డైరెక్టర్ గా మెప్పించి సక్సెస్ సాధిస్తాడనే ఫీలింగ్ క్రియేట్ చేసాడు. మరి.. మకుటం విశాల్ కెరీర్లో ఎలాంటి సినిమా అవుతుందో చూడాలి.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్