ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి ఆర్థిక లావాదేవీలతో పాటు, బినామీల వ్యవహారాలపై ఫోకస్ చేశారు.
కె.నాగేశ్వరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, రైల్వేకోడూరుకు చెందిన ముక్కా విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్‌కు పలు రైజింగ్ మిల్లులు, పలు భూములున్నట్లు గుర్తించారు.


