ఈత కొట్టడం ఇష్టమా? అయితే మీ స్కిన్‌, హెయిర్‌ రక్షించుకోండి ఇలా..

ఫుల్‌ బాడీ వర్కౌట్స్‌ చేయాలనుకుంటే అందులో ఈత గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. స్విమ్మింగ్‌ అనేది పూర్తి వ్యాయమంగా పరిగణించవచ్చు. ఇది గుండె ఆరోగ్యం, కండరాల బలం, మానసిక ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఈత కొలనులో క్లోరిన్‌, ఉప్పునీరు ఉంటుంది. అలాగే శరీరం ఎక్కువ సేపు తేమకు గురి కావడం వల్ల చర్మం, జుట్టు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకు ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఈతకు ముందు తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈతకు వెళ్లే ముందు ఇలా సిద్ధంకండి

పూల్‌లోకి వెళ్లే ముందు శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. చర్మం తడిగా ఉంటే క్లోరిన్ కలిగిన నీటిని తక్కువగా పీల్చుకుంటుంది. దీంతో పూల్‌లోని రసాయనాల వల్ల చర్మం పొడిబారే ప్రభావం తగ్గుతుంది. అలాగే చర్మంపై రక్షణ పొర ఏర్పడేందుకు తేలికపాటి, నీటిని తట్టుకునే మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి.

క్లోరిన్ వల్ల జుట్టు దెబ్బతినకుండా ఇలా కాపాడుకోవాలి

ఈత కొట్టేటప్పుడు జుట్టు క్లోరిన్ కలిగిన నీటిని పీల్చుకోవడం వల్ల పొడిబారడం, విరిగిపోవడం, రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు. దీనిని నివారించడానికి ఈతకు ముందు జుట్టును స్వచ్ఛమైన నీటితో కడిగి, కండీషనర్ లేదా హెయిర్ సీరమ్‌ను అప్లై చేయండి. ముఖ్యంగా తరచూ ఈత కొట్టేవారు స్విమ్ క్యాప్ ధరించడం మంచింది

ఈత అనంతరం శరీరాన్ని శుభ్రం చేసుకోండి

నీటిలో నుంచి బయటకు వచ్చిన వెంటనే శరీరాన్ని కడుక్కోవాలి. చర్మంపై ఉండే క్లోరిన్, ఉప్పు, మలినాలను తొలగించేందుకు మృదువైన క్లెన్సర్‌ను ఉపయోగించండి. జుట్టు కోసం, సహజ నూనెలను పూర్తిగా తొలగించకుండా రసాయన అవశేషాలను తొలగించే మైల్డ్ క్లారిఫైయింగ్ షాంపూను ఎంచుకోండి.

చర్మం, జుట్టుకు తేమను అందించాలి

ఈత వల్ల చర్మం, జుట్టు రెండూ తేమ కోల్పోయే అవకాశం ఉంది. స్నానం చేసిన తర్వాత హైలూరానిక్ యాసిడ్, గ్లిసరిన్ లేదా సెరమైడ్స్ వంటి పదార్థాలు కలిగిన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇవి చర్మంలో తేమను నిల్వ ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టుకు కండీషనర్ లేదా హెయిర్ మాస్క్ ఉపయోగించడం ద్వారా తేమను పునరుద్ధరించి, జుట్టును మృదువుగా, మెత్తగా, సులభంగా ఉంచేలా చేస్తాయి.

ఎల్లప్పుడూ సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి

ఈతకు వెళ్లినప్పుడు చర్మం, జుట్టు సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈతకు వెళ్లే కనీసం 15–20 నిమిషాల ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. ఎక్కువసేపు నీటిలో ఉన్నట్లయితే మళ్లీ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. అదనపు రక్షణ కోసం టోపీ ధరించడం కూడా మంచిది.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్