తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను వేడుకుంది. వీడియో వైరల్ కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ఏపీ NRI టీం అధికారులు, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భాగ్యవతిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
0
84
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


