అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సభ్యుల బృందాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ భూములు, జీవనాధారం దెబ్బతింటాయని, గ్రామాలు ముంపునకు గురవుతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సర్వే ప్రక్రియను కొనసాగించనివ్వబోమని హెచ్చరించారు.
మజ్జివలస గ్రామంలో ఉద్రిక్తత…హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
0
87
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


